కిక్కిరిసిన మేకల సంత
నవీపేట : నవీపేట మండల కేంద్రంలో శనివారం జరిగిన మేకల సంత వ్యాపారులు, వినియోగదారులతో కిక్కిరిసింది. మంగళ, బుధవారాలలో సంక్రాంతి బోగి, కనుమ పండగ సంబరాలు జరుగనుండటంతో ఒక్కసారిగా క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. కనుమ రోజున ప్రత్యేకంగా మాంసాహార విందు భోజనానికి ఆనవాయితీగా ప్రాధాన్యతనివ్వడంతో మేకల సంతలో సందడి నెలకొంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల కు చెందిన వ్యాపారులు శుక్రవారం రాత్రే సంతకు చేరుకున్నారు. సంత ప్రాంగణం ఇరుకుగా ఉండగా, బాసర రహదారికి ఇరువైపుల క్రయవిక్రయాలు జరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సంతలో రూ. 4 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.
రూ. 4 కోట్ల లావాదేవీలు..
సంక్రాంతి ప్రభావం
Comments
Please login to add a commentAdd a comment