వడ్డె ఓబన్న జయంతి
సుభాష్‌నగర్: కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో వడ్డె ఓబన్న జయంతి ఘనంగా ని ర్వహించారు. ఓబన్న చిత్రపటానికి అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులు పూ లమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆయన ధైర్యసాహసాలను కొనియాడారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి స్రవంతి, ఆయా సంఘాల ప్రతినిధులు దండి వెంకట్, పి వెంకటేష్, ఎత్తరి రాములు, నగేష్, శంకర్, బుస్స ఆంజనేయులు, రాజేశ్వర్ పాల్గొన్నారు.
ఆర్టీఏ సభ్యుడిగా
నరేందర్ గౌడ్
నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ప్రాంతీయ రవాణా అథారిటీ సభ్యుడిగా కాంగ్రెస్ నాయకుడు నరేందర్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం రవాణా అధికారులు నరేంద్ర గౌడ్‌కు నియామక పత్రం అందించారు. పార్టీకి తాను చేసిన సేవలను గుర్తించి బాధ్యతలు అప్పగించిన పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సంతోషంగా పండుగ జరుపుకోవాలి
ఖలీల్‌వాడి: ప్రజలు సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఇన్‌చార్జి సీపీ సింధుశర్మ ఆకాంక్షించారు. జిల్లా ప్రజ లకు ఆమె శనివారం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మూడు రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపుకోవాలన్నారు. ప్రజలు, పోలీస్ సిబ్బంది సోదర భావంతో మెలగాలని కోరారు.
ఖిల్లా రామాలయంలో వీహెచ్‌పీ పూజలు
నిజామాబాద్ రూరల్: అయోధ్యలో బాల రాముడి విగ్రహం ప్రతిష్ఠించి తిథి ప్రకారం ఏడాది అవుతున్న సందర్భంగా విశ్వ హిందు పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వందల మంది రామభక్తులతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా సహ కార్యదర్శి దాత్రిక రమేష్, నగర కార్యదర్శి రాంప్రసాద్ చెటర్జీ, భాసొల్లా నీకేష్, అఖిల్, ఇందూరు సురేష్, ఎండల సాయి, శివ, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్‌కు విద్యార్థి ఎంపిక
నిజామాబాద్ అర్బన్: ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు జిల్లాకు చెందిన సానిక ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి 41 మందిని ఎంపిక చేస్తూ శనివారం రక్షణ శాఖ అధికారులు జాబితా విడుదల చేశారు. ఇందులో ఆర్మూర్ బీసీ బాలికల కాలేజీకి చెందిన సానిక కూడా ఎంపికయ్యారు.
యువజన ఉత్సవాల ప్రతినిధిగా శైలి బెల్లాల్
నిజామాబాద్ నాగారం: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఢిల్లీలో జరిగే యువజన ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల ప్రతినిధిగా జిల్లా యువజన అధికారి శైలిబెల్లాల్ నియమితులయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ పోటీలకు ఎంపికై న యువతి, యువకులకు ఆమె ఇన్‌చార్జీగా వ్యవహరిస్తారు. శనివారం ఆమె కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌నాయుడుతో సమావేశమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment