సాగునీటి కోసం పాట్లు
బాల్కొండ: తలాపునే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సాగునీటి కోసం ఆ గ్రామ రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఎగువనే ప్రాజెక్ట్ ఉన్నా ఆ నీటి కోసం కాలువల వద్దనే వంతుల వారిగా కాపలా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. లక్ష్మి కాలువ డీ–3 ఆధారంగా నిర్మించిన వేంపల్లి ఎత్తిపోతల పథకం నీటి కోసం మోర్తాడ్ మండలం ధర్మోరా రైతులు ముప్కాల్ మండలం వేంపల్లి శివారులో మైనర్ కాలువ వద్ద రాత్రి, పగలు కాపలా కాస్తున్నారు. లిఫ్ట్ నుంచి ఎల్–1 కాలువ ద్వారా ధర్మోరాకు నీటి సరఫరా చేపడుతారు. ఆ నీరు సరిపడ రాకపోవడంతో ఎల్–2 కాలువ, ఎంఎల్–4 నుంచి కూడా నీరు అవసరం అవుతోంది. కాలువ వెంట పొలాలు ఉన్న రైతులు గండ్లు కొట్టడం, మోటర్లు బిగించడంతో నీరు చివరికి చేరడం లేదు. దీంతో వాటిని అడ్డుకుని నీటిని చివరి ఆయకట్టుకు చేర్చడం కోసం రైతులు వంతుల వారీగా కాపలా కాస్తున్నారు.
లష్కర్ల కొరత
కాలువ వెంబడి తిరగాల్సిన లష్కర్లు తక్కువగా ఉండటం, ఉన్న వారికి నీటి పంపకాలపై అవగాహన లేకపోవడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ప్రాజెక్ట్ నుంచి దూర ప్రాంతాలకు నీటి విడుదల చేస్తున్న అధికారులు స్థానిక రైతులకు సాగునీరు అందకున్నా పట్టించుకోవడం లేదు. ముందు ఉన్న రైతులే నీటిని తరలించుకుపోతున్నారు. చివర ఉన్న వారికి సాగు నీరు అందడం లేదు. నీటి పంపకాలను సమానంగా చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. దీనిపై బాల్కొండ మైనర్ ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ సురేశ్‌ను వివరణగా ఎత్తిపోతల పథకం ద్వారా రైతులందరికి సమానంగా నీటి సరఫరా చేపడుతున్నట్లు తెలిపారు. మూడు పంపులతో నీటిని ఎత్తిపోస్తున్నట్లు తెలిపారు.
కాలువ వద్ద కాపలా కాస్తున్న
ధర్మోరా రైతులు
Comments
Please login to add a commentAdd a comment