గ్రామ, వార్డు సభలకు పక్కాగా ఏర్పాట్లు
సుభాష్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్జేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి గ్రామ, మున్సి పల్ వార్డు సభల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చే యాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సూచించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పథకాలను అమల్జేయాలని ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో, చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ శనివారం జూమ్ మీటింగ్ ద్వారా దిశానిర్దేశం చేశారు. రైతు భరోసా పథకం కింద పట్టా పాస్ పుస్తకాలు ఉన్న రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.12 వేల పెట్టు బడి సాయం జమ చేస్తుందన్నారు. భూ భారతి(ధరణి) పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా రైతు భరోసా పథకం కింద అర్హులైన వారిని గుర్తించాలని సూచించారు. తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ నెల 20లోపు క్షేత్రస్థాయి సందర్శన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామ సభల్లో వివరాలు వెల్లడిస్తూ, గ్రామసభ ఆమోదం తర్వాత పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలన్నారు.
భూమి లేని కూలీలకు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
సాగు భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు అందించేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద అర్హులను గుర్తించాలని కలెక్టర్ సూచించారు. 2023–24 సంవత్సరంలో కనీసం 20 రోజులు ఉపాధి పనులు చేసిన వ్యవసాయ కూలీ కుటుంబాలు ఆత్మీయ భరోసా పథకానికి అర్హులని తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపులో ఎంపీడీవోలు, ఏపీవోలు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. కొత్త ఆహార భద్రత (రేషన్) కార్డులు జారీ విషయంలోనూ క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి తలసరి ఆదాయం, భూమి కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందించడమే కాకుండా, మార్పులు చేర్పులను సైతం చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంపిక చేయాలన్నారు. గ్రామసభల్లో ఇందిరమ్మ కమిటీల ప్రతినిధులు పాల్గొనేలా చూడాలని పేర్కొన్నారు. అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా చొరవ చూపాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీవో సాయాగౌడ్, ఇన్‌చార్జి డీపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
Comments
Please login to add a commentAdd a comment