జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు నేహశ్రీ
డిచ్‌పల్లి: మండలంలోని సుద్దపల్లిలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలకు చెందిన నేహశ్రీ జాతీయస్థాయి సీనియర్ సౌత్ జోన్ సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ నళిని శనివారం తెలిపారు. ఈ నెల 5న మనోహరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సెలెక్షన్ టోర్నమెంట్‌లో విద్యార్థి చక్కని ప్రతిభ కనబర్చి, ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు పాండిచ్చేరిలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు నేహశ్రీ ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన నేహశ్రీని ప్రిన్సిపాల్‌తో పాటు వైస్ ప్రిన్సిపాల్‌లు స్వప్న, వనిత, ఫిజికల్ డైరెక్టర్ జోత్స్న, పీఈటీ శ్రీలత, సాఫ్ట్‌బాల్ అకాడమీ కోచ్ మౌనిక, అధ్యాపకులు తదితరులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment