కాషాయ జెండా ఎగురవేయాలి
సుభాష్‌నగర్: జిల్లాలో రాబోయే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా మండలాల నూతన అధ్యక్షులు పని చేయాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి సూచించారు. జిల్లాలోని ఆయా మండలాలకు అధ్యక్షులుగా ఎన్నికై న వారికి ఎంపీ అర్వింద్ హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం నియామకపత్రాలు అందజేశారు. ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, మండలాల అధ్యక్షులతో ఎంపీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ జిల్లాలో బీజేపీ మరింత బలోపేతానికి తమవంతు కృషి చేయాలని సూచించారు. జెడ్పీ, కార్పొరేషన్, మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లు, గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతలను తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, కంచెట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ అర్వింద్ ధర్మపురి
మండలాల అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేత
Comments
Please login to add a commentAdd a comment