చెట్టును ఢీకొన్న ఆటో : ముగ్గురికి గాయాలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాల్తుమ్మెద గ్రామసమీపంలో వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఓ ఆటో శనివారం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని ధర్మారెడ్డి గ్రామానికి చెందిన పలువురు మహిళాకూలీలు వ్యవసాయ పనుల కోసం ఆటోలో శనివారం ఉదయం మాల్తుమ్మెద గ్రామానికి బయల్దేరారు. ఆటో మాల్తుమ్మెద గ్రామ సమీపంలోకి చేరుకున్న తర్వాత అదపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొన్నది. ఈ ఘటనలో సునీత అనే మహిళకు తీవ్రగాయాలు కాగా, భాగ్యలక్ష్మి, లావణ్య అనే మహిళలకు స్వల్పగాయాలయ్యాయి. సునీతను మెరుగైన చికిత్స కోసం మెదక్ ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. కాంగ్రెస మండలాధ్యక్షుడు, ధర్మారెడ్డి గ్రామ మాజీసర్పంచ్ శ్రీధర్‌గౌడ్ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ఆయనవెంట యూత్‌కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీరాంగౌడ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment