‘ఉపాధి’లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
బాల్కొండ: ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఆర్డీవో సాయాగౌడ్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద శనివారం 16వ సామాజిక ప్రజావేదిక నిర్వహించారు. 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చేపట్టిన పనులపై గత వారం రోజులుగా నిర్వహించిన సామాజిక తనిఖీ వివరాలను విలేజ్ సోషల్ ఆడిటర్లు చదివి వినిపించారు. ప్రధానంగా గ్రామాల్లో నాటిన మొక్కలు చనిపోతే వాటి స్థానంలో మొక్కలు నాటక పోవడం, వన సేవకులకు వేతనాలను అందకపోవడాన్ని గుర్తించారు. మస్టర్లలో కూలీల సంతకాల సేకరణలో జాప్యం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. డీఆర్డీవో సాయాగౌడ్ మాట్లాడుతూ.. కూలీలందరికీ పని దినాలు కల్పించాలని, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. మస్టర్లలో సంతకాలు తీసుకోని పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లకు జరిమానా విధించారు. జిల్లా విజిలెన్స్ అధికారి నారాయణ, ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీధర్, ఏపీవో ఇందిర, ఎస్‌ఆర్పీ రమేశ్, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.ఇదిలా ఉండగా అధికారులు వచ్చారు, నివేదిక చదివారు, వెళ్లిపోయారు అన్నట్లు ప్రజావే దిక నిర్వహించారని పలువురు పెదవి విరించారు.
Comments
Please login to add a commentAdd a comment