కొనసాగుతున్న నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి యాసంగిలో ఆయకట్టుకు కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 4వేల క్యూసెక్కు లు, వరద కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కులు నీటి విడుదల జరుగుతుంది. అలాగే లక్ష్మి కాలువ ద్వారా 250 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 700 క్యూసెక్కులు, అలీసాగర్ లిప్టు ద్వారా 450 క్యూసెక్కులు, గుత్ప లిప్టు ద్వారా 135 క్యూసెక్కులు, ఎత్తిపోతల పథకా ల ద్వారా 312 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 397 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వా రా 231 క్యూసెక్కుల నీరు తాగు నీటి అవసరాల కోసం పోతుంది. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా తగ్గుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1083.70(55.6 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. గతేడాది ఇదే రోజున ప్రాజెక్ట్‌లో 50 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment