రావిచెట్టుకు చీరతో సన్మానం
డిచ్‌పల్లి: మండలంలోని సుద్దపల్లి ఉన్నత పాఠశాలలో మంగళవారం సొసైటీ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ ఆధ్వర్యంలో ’పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కాలుష్యం వల్ల పర్యావరణంలో వచ్చే మార్పులు, భవిష్యత్ తరాల వారికి కలిగే నష్టాలను వివరించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉన్న రావి చెట్టును భూమాతగా గుర్తించి చీరతో సన్మానించారు. సంస్థ తెలంగాణ ప్రాంత డైరెక్టర్ అనుదీప్, కోటి మొక్కల పెంపకం లక్ష్యంగా చేసుకున్న పర్యావరణ వేత్త జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ అనేది అందరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించడం ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. హెచ్‌ఎం నరేష్, ఉపాధ్యాయులు ఉమా, శశి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment