పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో ప్రతిభ
బోధన్ టౌన్ (బోధన్): కరీంనగర్‌లో జనవరి 28 నుంచి ఈనెల 1వ తేదీ వరకు కరీంనగర్‌లో నిర్వహించిన 3వ తెలంగాణ స్టేట్ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌లో బోధన్ డివిజన్‌కు చెందిన ఐదుగురు పోలీసులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. వివిధ పోటీల్లో రెండు బంగారు, రెండు వెండి, ఆరు కాంస్య పతకాలను సాధించారని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. స్పోర్ట్స్ మీట్‌లో ప్రతిభచూపిన సిబ్బందిని బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఆయన అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. రుద్రూర్ పీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎండీ అఫ్సర్ స్విమ్మింగ్‌లో ఒక బంగారు, రెండు వెండి, ఒక కాంస్య పతకాలను, బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సాయికృష్ణ రన్నింగ్‌లో ఒక బంగారు పతకాన్ని సాధించారని, అలాగే ఏఎస్సై గంగాప్రసాద్ టేబుల్ టెన్నిస్‌లో ఒక కాంస్య పతకం, బోధన్ రూరల్ పీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న నరేందర్ మూడు విభాగాల్లో మూడు కాంస్య పతకాలు, కోటగిరి పీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న అరుణ్‌కుమార్ కరాటేలో ఒక బంగారు పతకాన్ని సాధించినట్లు వివరించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ వెంకటనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment