మాక్లూర్‌లో ఒకరికి డెంగీ
మాక్లూర్: మండల కేంద్రానికి చెందిన ఒకరు డెంగీ బారినపడ్డారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, సిబ్బందితో కలిసి ఆశ, ఆరోగ్య కార్యకర్తలు సోమవారం రోగి ఇంటి పరిసరాలతోపాటు డ్రెయినేజీలను శుభ్రం చేసి స్ప్రే చేశారు. దోమల ద్వారా వచ్చే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. పర్యవేక్షణ సి బ్బంది సుధాకర్, ఏఎన్‌ఎం కమల, ఆశ కా ర్యకర్తలు శిరీష, జయశీల, జ్యోతి, కరీమా, శిరీష పాల్గొన్నారు.
చారిత్రక కట్టడాలను కాపాడుకోవాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): చారిత్రక కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పతంజలి విశ్వవిద్యాలయం డీన్ స్వామి పరమార్థదేవ్ అన్నారు. సోమవారం ఆయన లింగంపేట మండల కేంద్రంలోని చారిత్రక కట్టడం నాగన్నగారి మెట్ల బావిని సందర్శించి మాట్లాడారు. చారిత్రక కట్టడాలు మన సంస్కృతి, సాంప్రదాయాలకు గుర్తులుగా నిలుస్తాయన్నారు. యోగా గురువులు రాంరెడ్డి, గ్రామస్తులు శ్రీకాంత్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
‘మన పెరటి మొక్కలతోనే మన ఆరోగ్యం’
కామారెడ్డి అర్బన్: ఆయుర్వేదం మన జీవన విధానమని, పెరటి మొక్కలు తిప్పతీగ, కలబంద, తులసి, పారిజాతం, మునగ మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని స్వామి పరమార్థదేవ్ అన్నారు. భారత్ స్వాభిమాన్ ట్రస్టు, పతంజలి యోగా సమితి జిల్లా శాఖల ఆధ్వర్యంలో శని, ఆది, సోమ వారాల్లో నిర్వహించిన మూడు రోజుల మెగా యోగా శిబిరం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్‌స్వాభిమాన్ ట్రస్టు, పతంజలి యోగా సమితి రాష్ట్ర, జిల్లా నాయకులు శ్రీధర్‌రావు, నందనం కృపాకర్, శివకుమార్, గడ్డం యోగా రాంరెడ్డి, పెట్టుగాడి అంజయ్య, రఘుకుమార్, బి.అనిల్‌కుమా ర్, సురేందర్, ఎల్ల య్య, ఎ.రమేష్, అంజయ్యగుప్తా, అంతిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment