మద్యానికి బానిసై వేర్వేరు చోట్ల ఇద్దరి ఆత్మహత్య
రుద్రూర్/నందిపేట్: మద్యానికి బానిసై వేర్వేరు చోట్ల ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రుద్రూర్‌మండలం అంబం(ఆర్)లో పిట్ల శ్రీనివాస్, నందిపేట్ మండల వన్నెల్(కే)లో ఇండ్ల కృష్ణ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయా ఘటనలకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి..
బోధన్‌కు చెందిన పిట్ల శ్రీనివాస్(40) అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి బతుకుదెరువుకోసం రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు. మేసీ్త్రగా పని చేస్తూ శ్రీనివాస్ కుటుంబాన్ని పోషించేవాడు. ఆరు నెలల క్రితం ప్రమాదవశాత్తు అతడి కాలు విరగగా, అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. చికిత్స అనంతరం కాలు నయమైనప్పటికీ పని చేయకుండా ఇంటి వద్దనే ఉంటుండడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం భార్య గంగాలత బ్యాంకు పని నిమిత్తం రుద్రూర్‌కు వెళ్లగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీనివాస్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరికి పదేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. తన భర్త మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు.
నందిపేట మండలం వన్నెల్(కే) గ్రామంలో నివాసం ఉంటున్న నెల్లూరు జిల్లా జొన్నాడ గ్రామానికి చెందిన ఇండ్ల కృష్ణ (32) అనే వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇండ్ల కృష్ణ గత రెండు సంవత్సరాల క్రితం నెల్లూరు నుంచి వన్నెల్ (కే) గ్రామానికి వచ్చి గౌసుద్దీన్ అనే వ్యక్తికి చెందిన ఇటుక బట్టీలో కుటుంబ సభ్యులతో కలిసి పనిచేసుకుంటూ ఇక్కడే ఉండేవాడు. గత కొన్ని రోజలుగా ఇండ్ల కృష్ణ తాగుడికి బానిసై పనికి సరిగా వెళ్లడంలేదు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఇటుక బట్టీ ఆవరణలో ఉన్న వేపచెట్టుకు ఆదివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి అన్న ఇండ్ల మణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment