జాతీయస్థాయి అథ్లెటిక్స్‌లో పతకాల పంట
నిజామాబాద్‌నాగారం: జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జిల్లాకు పతకాల పంట పండింది. జనవరి 31 నుంచి ఈనెల 3వ తేదీ వరకు కేరళ రాష్ట్రంలోని త్రిశూల్ జిల్లా కున్నంగుళంలో నిర్వహించిన జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించిన నిజామాబాద్ జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ 22 మెడల్స్ సాధించారు. రాష్ట్రాన్ని రెండో స్థానంలో నిలిపారు. జిల్లాకు చెందిన అథ్లెట్స్‌ను అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీను నాయక్, ప్రధాన కార్యదర్శి గోపిరెడ్డి, ట్రెజరర్ నీతారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కిరణ్‌కుమార్ అభినందించారు.
పతకాలు సాధించింది వీరే..
దినేశ్ వాగ్మారే (లాంగ్ జంప్, సిల్వర్ మెడల్), గోపి, ఉత్తమ్ (సిల్వర్, హారి్‌డ్‌ల్స్), ఎస్ వెంకటేశ్ (హై జంప్, బ్రాంజ్ మెడల్), జి రఘువీర్ (షాట్‌పుట్, బ్రాంజ్ మెడల్), ఎం నర్సయ్య (5కే రన్, గోల్డ్ మెడల్), ఆమేర్ అలీ (5కే రన్, సిల్వర్ మెడల్), పద్మ (400, 800 మీటర్స్ గోల్డ్ మెడల్), సౌజన్య (హై జంప్, గోల్డ్ మెడల్), స్రవంత్రి (జావెలిన్ త్రో, బ్రాంజ్ మెడల్), షడ్రక్ (ట్రిపుల్ జంప్, బ్రాంజ్ మెడల్), గోపి (ట్రిపుల్ జంప్, సిల్వర్ మెడల్), దినేశ్ (ట్రిపుల్ జంప్, బ్రాంజ్ మెడల్, 100 మీటర్స్ రిలే, సిల్వర్ మెడల్), పల్లవి రెడ్డి (400 మీటర్స్ హార్డిల్స్, గోల్డ్ మెడల్), సౌజన్య (ట్రిపుల్ జంప్, గోల్డ్ మెడల్), స్రవంతి (ట్రిపుల్ జంప్, బ్రాంజ్ మెడల్), అషీలి గోపి (400 మీటర్స్ హార్డిల్స్, గోల్డ్‌మెడల్), దినేశ్ వాగ్మారే (100 మీటర్స్, బ్రాంజ్ మెడల్), జి రఘువీర్ (హ్యమర్ త్రో, బ్రాంజ్ మెడల్), ఎల్ పద్మ (5కే రన్, సిల్వర్ మెడల్).
Comments
Please login to add a commentAdd a comment