![నిజామాబాద్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11nzt08-604902_mr-1739333306-0.jpg.webp?itok=Y1kZah4U)
నిజామాబాద్
పెరగనున్న బీర్ల ధరలు
వేసవికి ముందే బీరు ప్రియులకు షాక్ తగలనుంది. బీర్ల ధర 15శాతం పెంపునకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
బుధవారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
– 8లో u
పాపారావు వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ సాగు విధానంలో పెంచుతున్న వివిధ రకాల పండ్ల చెట్లు
రైతులు ‘పాడి.. పంట’ నినాదంతో వ్యవసాయం చేస్తే సమాజానికి ఎనలేని మేలు కలుగుతుందని సేంద్రియ సాగు చేస్తున్న పలువురు రైతులు అభిప్రాయపడ్డారు. రుద్రూర్‌లోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఆధ్వర్యంలో మంగళవారం ఎడపల్లి మండలంలోని జైతాపూర్‌కు చెందిన ఆదర్శ రైతు కరుటూరి పాపారావు వ్యవసాయ క్షేత్రంలో ‘ప్రకృతి వ్యవసాయం’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే సమన్వయకర్త, శాస్త్రవేత్త అంజయ్య మాట్లాడుతూ.. రైతులు ప్రకృతి వ్యవసాయం దిశగా మళ్లాలన్నారు. సేంద్రియ రైతులకు బ్రాండింగ్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తోందని తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆదర్శ రైతులను సన్మానించారు. సదస్సులో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త స్వప్న, జిల్లా, చుట్టుపక్కల జిల్లాలకు చెందిన రైతులు, జగిత్యాల వ్యవసాయ కళాశాలకు చెందిన అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేంద్రియసాగుపై రైతులు తమ అభిప్రాయాలను వేదికపై పంచుకున్నారు.
– సాక్షి ప్రతినిధి, నిజామాబాద్
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment