![ప్రపంచంలోనే కందకుర్తికి ప్రత్యేక గుర్తింపు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11bdn152-250017_mr-1739333307-0.jpg.webp?itok=6piJJ3jZ)
ప్రపంచంలోనే కందకుర్తికి ప్రత్యేక గుర్తింపు
● ఆర్‌ఎస్‌ఎస్ ద్వారానే
ఉన్నత స్థానానికి ఎదిగాను
● త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి
రెంజల్(బోధన్): రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకులు కేశవ బలిరాం హెడ్గేవార్ పూర్వీకుల స్వస్థలమైన రెంజల్ మండలంలోని కందకుర్తి ప్రపంచంలోని కోట్లాది మందికి మార్గనిర్దేశం చేసిన గ్రా మమని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నా రు. మంగళవారం ఆయన గ్రామాన్ని సందర్శించా రు. ముందుగా హెడ్గేవార్ పూర్వీకుల స్ఫూర్తి మందిరాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామంలోని స్వ యంభూవుగా వెలిసిన రామాలయంలో ప్రత్యేక పూ జలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ ద్వారానే తాను త్రిపుర గవర్నర్ స్థాయికి ఎదిగానని అన్నారు. 1963లో బాల్య సేవక్ నుంచి డిగ్రీ వరకు వివిధ స్థాయిల్లో శిక్ష వర్గ వంటి అన్ని రకాల కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. విద్యార్థి పరిషత్ సిటీ ఆర్గనైజర్ గా, తర్వాత జనతా పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం ప్రారంభమైందన్నారు.
దేశంలోని చిన్న రాష్ట్రాల్లో మూడోది..
దేశంలోని చిన్న రాష్ట్రాల్లో త్రిపుర మూడో రాష్ట్రమని, 40 లక్షల జనాభా, 60 మంది ఎమ్మెల్యేలు ఉంటారని ఇంద్రసేనా రెడ్డి పేర్కొన్నారు. త్రిపురకు మూడు వైపులా బంగ్లా సరిహద్దు 856 కిలోమీటర్లు ఉంటుందన్నారు. అస్సాం, మిజోరాం రాష్ట్రాలు కూడా 150 కిలోమీటర్లు ఉంటాయన్నారు. రాబోయే రోజుల్లో త్రిపుర రాష్ట్రం నార్తీస్ట్ ప్రాంతానికి గేట్‌వేగా మారుతుందన్నారు. తనను ఈ స్థాయికి తీసుకు వచ్చిన ఆర్‌ఎస్‌ఎస్‌కు కృతజ్ఞుడినై గతంలో కందకుర్తికి రెండు పర్యాయాలు వచ్చానని, గవర్నర్ స్థాయిలో ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని తెలుసుకునేందుకు మూడవ పర్యాయం గ్రామానికి వచ్చినట్లు తెలిపారు. ఆయన వెంట కేశవ సేవా సమితి అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి, వాసు, అంకు మహేశ్, బీ జేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్‌రెడ్డితో పాటు మండల, జిల్లా ప్రతినిధులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment