![లిఫ్ట్‌ల నిర్వహణకు నిధులు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11blk01-250010_mr-1739333306-0.jpg.webp?itok=kXlmGoKX)
లిఫ్ట్‌ల నిర్వహణకు నిధులు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని సరఫరా చేసే లక్ష్మి కాలువపై నిర్మించిన ఎత్తిపోతల పథకాల(లిఫ్ట్‌లు) నిర్వహణకు ప్రభుత్వం రూ.10 కోట్ల 47 లక్షల 40 వేలు మంజూరు చేసింది. ఎత్తిపోతల పథకాల నిర్వహణకు నిధులు మంజూరు చేస్తామని రెండు నెలల క్రితం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. నిధుల మంజూరుపై ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ నుంచి నీటిని సరఫరా చేసే లక్ష్మి కాలువను 1064 అడుగుల నీటి మట్టం వద్ద నిర్మించగా, ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గిన సమయంలో ఆయకట్టు చివరి వరకు నీరు అందేది కాదు. ఈ నేపథ్యంలో 2007లో అప్పటి ప్రభుత్వం ప్రణాళిక నిధులతో లక్ష్మి ఎత్తిపోతల పథకాన్ని 1045 అడుగుల నీటి మట్టం వద్ద ప్రాజెక్ట్‌లో నిర్మించింది. ప్రస్తుతం ఆ ఎత్తిపోతల పథకం కూడా మైనర్ ఇరిగేషన్ ఆధ్వర్యంలోకి వచ్చింది. ప్రాజెక్టులోని లిఫ్ట్‌తోపాటు డీ–3 పై నిర్మించిన వేంపల్లి, బోదేపల్లి, నవాబు ఎత్తిపోతల పథకాల నిర్వహణకు మూడేళ్ల కోసం ప్రభుత్వం ఒకేసారి నిధులు విడుదల చేస్తూ వారం రోజుల క్రితం జీవో జారీ చేసింది. టెండర్ ప్రక్రియ పూర్తయితే వేసవిలో మరమ్మతులు చేపట్టి ఖరీఫ్ సీజన్ ప్రారంభం నాటికి ఎత్తిపోతలు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవచ్చని రైతులు అంటున్నారు.
లక్ష్మికాలువ ఎత్తిపోతలకు
మంచి రోజులు
మూడేళ్లకు రూ.10.47 కోట్లు విడుదల
త్వరలోనే టెండర్
లక్ష్మి కాలువ ఎత్తిపోతల పథకంతోపాటు కాలువపై నిర్మించిన ఎత్తిపోతల పథకాల మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. త్వరలోనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం.
– సురేశ్, డీఈఈ, మైనర్ ఇరిగేషన్, బాల్కొండ
Comments
Please login to add a commentAdd a comment