ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
చిలకలపూడి(మచిలీపట్నం): దీపావళి పండుగ ప్రతి ఇంటా వెలుగులు నింపాలని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక బుధవారం వేర్వేరు ప్రకటనల్లో ఆకాంక్షించారు. ప్రతిఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలంటూ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
మిత్రుడి కుటుంబానికి
ఆర్థిక సాయం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఇటీవల విజయవాడ రైల్వేస్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ దుండగుడి దాడిలో మృతిచెందిన లోకోపైలట్ ఎబినేజర్ కుటుంబానికి అతని మిత్రులు ఆర్థిక సాయం అందజేశారు. సికింద్రాబాద్‌కు చెందిన ఎబినేజర్ క్లాస్‌మేట్స్, మిత్రులు బుధవారం విజయవాడ వచ్చి ఎబినేజర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఎబినేజర్ భార్యకు రూ.1.20లక్షలను ఆర్థికసాయంగా అందజేశారు. లోకోపైలట్ విజయ్‌కుమార్, మిత్రులు సాయిరాము పాల్గొన్నారు.
లారీ ఢీకొని
ఇద్దరు కూలీలు దుర్మరణం
పామర్రు:విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిలో పామర్రు పరిధిలోని కంచర్లవానిపురం అడ్డరోడ్డు వద్ద బుధవారం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ఇద్దరు తాపీ కూలీలు దుర్మరణం చెందారు. ఎస్‌ఐ అవినాష్ కథనం మేరకు..అంగలూరుకు చెందిన సయ్యద్ అబ్దుల్‌ఖాదర్(48), రహమాన్‌బేగ్(38) కంచర్లవానిపురానికి దగ్గరలోని ఓ మిల్లు వద్ద తాపీపనికి వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో వారు బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తూ జాతీయ రహదారిని దాటుతుండగా, మచిలీపట్నం నుంచి విజయవాడ వైపునకు వస్తున్న లారీ వేగంగా వచ్చి వీరిని ఢీ కొట్టింది. దీంతో ఎగిరి డివైడర్‌పై పడిన వీరిద్దరూ తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. లారీడ్రైవర్ వెంటనే పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment