కంచికచర్ల: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కంచికచర్లలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ బోనగిరి రాజు కథనం మేరకు విజయవాడకు చెందిన కారంపూడి రవీంద్ర(50) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. అప్పులు ఎక్కువగా ఉండటంతో విజయవాడ నుంచి మిక్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఓ వెంచర్‌కు వచ్చి అక్కడ గడ్డిమందు తాగాడు. అనంతరం స్నేహితుడికి ఫోన్‌చేసి గడ్డిమందు తాగిన విషయం చెప్పడంతో అతను హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని చూడగా అప్పటికే రవీంద్ర నేలపై కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో అతన్ని చికిత్స కోసం ప్రైవేట్వాహనంలో విజయవాడ తరలిస్తుండగా, మార్గంమధ్యలో మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. వీరంతా అమెరికాలో ఉంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment