జాతీయ పోటీలకు ఐజీఎంసీ క్రీడాకారులు
విజయజవాడస్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌జీఎఫ్‌ఐ) అండర్–19 బాస్కెట్‌బాల్ జాతీయ పోటీలకు ఎంపికై న విజయవాడ క్రీడాకారులను ఎన్టీఆర్ జిల్లా డీఎస్‌డీవో ఎస్.ఏ.అజీజ్ సోమవారం అభినందించారు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఎ.అమల్‌రెడ్డి, జి.నిరంజన్‌రాయల్ బాలుర జట్టులో, షేక్ హఫ్సా బాలికల జట్టులో సత్తా చాటారు. అనంతరం జరిగిన రాష్ట్ర జట్ల ఎంపిక పోటీల్లోనూ వీరు విశేష క్రీడా నైపుణ్యం ప్రదర్శించి జాతీయ పోటీలకు అర్హత సాధించారు. వీరు ముగ్గురు ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పోరేషన్ స్టేడియం(ఐజీఎంసీ)లో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ(డీఎస్‌ఏ) కోచ్ ఎస్.సంతోష్‌కుమార్ శిక్షణ తీసుకుంటున్నారని డీఎస్‌డీవో తెలిపారు. ఇదే క్రీడాస్పూర్తితో జాతీయ పోటీల్లో సత్తా చాటి జిల్లా, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప జేయాలని క్రీడాకారులకు సూచించారు.
జాతీయ పోటీలకు పెడసనగల్లు విద్యార్థి...
పెడసనగల్లు(మొవ్వ): స్కూల్ గేమ్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఏపీ ఇంటర్ స్ట్రిక్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మొవ్వ మండలం పెడసనగల్లు జెడ్పీ హైస్కూల్ విద్యార్థి ఆరేపల్లి దుర్గారావు (పదోతరగతి) ఉత్తమ ప్రతిభ కనపరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం కె.శిరీషా సోమవారం తెలిపారు. ఇటీవల గూడూరు హైస్కూల్‌లో జరిగిన అండర్–17 బాలికల విభాగంలో త్రోబాల్ పోటీలో రాజులపాటి మౌనిక ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. క్రీడాకారులు దుర్గారావు, మౌనిక, ఫిజికల్ డైరెక్టర్ బి.నాగశివలను హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment