రూ.1,300 కోట్ల టర్నోవరే లక్ష్యం
విజయ డెయిరీ చైర్మన్ చలసాని
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.1300 కోట్ల టర్నోవర్ సాఽధించడమే లక్ష్యంగా కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) కృషి చేస్తోందని ఛైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. సమావేశం సోమవారం పాలప్రాజెక్టు ఆవరణలోని పరిపాలనా భవనంలో సోమవారం నిర్వహించిన విజయ డెయిరీ బోర్డు డైరెక్టర్ల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. రైతులకు బోనస్, పాల సేకరణ ధర పెంపు, రానున్న ఆర్థిక సంవత్సరం లక్ష్యాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ చలసాని మాట్లాడుతూ పాడి రైతులకు మేలు కలిగించేలా పాల సేకరణ ధరను 10 శాతం వెన్న ఉన్న పాలకు లీటర్‌కు రూ.20 పెంచినట్లు తెలిపారు. ఆవు పాలకు లీటర్‌కు రూ.10 పెంచుతున్నామన్నారు. ఇటీవల వరదల నేపధ్యంలో తీవ్రంగా నష్టపోయిన పాడి రైతుల శ్రేయస్సు దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి నవంబర్ వరకు పాడిరైతులకు రెండో విడత బోనస్ రూ.12 కోట్లను డిసెంబర్ నెలాఖరు నాటికి అందించేలా బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సమావేశంలో ఎండీ కొల్లి ఈశ్వరబాబు, బోర్డు డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment