వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): నగరంలోని దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేయడంపై ఆ బ్యాంకు ఉద్యోగులు హైకోర్టును సోమవారం ఆశ్రయించారు. బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఆర్‌బీఐ ఇటీవల ప్రకటించింది. బ్యాంకు కార్యకలాపాలను పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని లిక్విడేటర్‌ను నియమించాలని సూచించింది. దీనిపై ఉద్యోగులు హైకోర్ట్‌ను సోమవారం ఆశ్రయించారు. హైకోర్టు యథాస్థితిని కొనసాగించాలని ఆదేశించినట్లు తెలిసింది. ప్రభుత్వం లిక్విడేటర్ ఆదివారం వరకూ నియమించలేదు. హైకోర్టు ఆదేశాలతో జిల్లా సహకార అధికారి శ్రీనివాసరెడ్డిని లిక్విడేటర్‌గా నియమించినట్లు తెలిసింది. ఆయన పాత తేదీతో చార్జి తీసుకున్నట్లుగా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment