సెపక్ తక్రా రాష్ట్ర చాంపియన్‌గా ‘కృష్ణా’
విజయవాడస్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) అండర్–14 సెపక్ తక్రా 68వ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా బాల, బాలికల జట్లు విజేతలుగా నిలిచాయి. పటమట జెడ్పీ స్కూల్‌లో రెండు రోజుల పాటు హోరాహోరీగా ఈ పోటీలు జరిగాయి. సోమవారం జరిగిన బాలుర ఫైనల్స్‌లో అనంతపురంపై కృష్ణా జట్టు 15–9, 15–11 తేడాతో గెలవగా, బాలికల ఫైనల్స్‌లో పశ్చిమగోదావరిపై 15–6, 15–2 తేడాతో కృష్ణా జట్టు విజయం సాధించింది. బాలుర విభాగంలో అనంతపురం, తూర్పుగోదావరి జట్లు ద్వితీయ, తృతీయ, బాలికల విభాగంలో పశ్చిమగోదావరి, నెల్లూరు ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించాయి. విజేతలకు కేజీబీవీ పాఠశాలల రాష్ట్ర డైరెక్టర్ డి.దేవానందరెడ్డి, స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరి ఎస్.రమేష్, స్కూల్ హెచ్‌ఎం ఎం.శాంతిశ్రీ, మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ కోశాధికారి ఎన్.రాఘవరావు ట్రోఫీలు అందజేశారు.
రాష్ట్ర జట్టు ఎంపిక..
అనంతరం జరిగిన రాష్ట్ర జట్టు ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో బాలుర జట్టు కృష్ణా జిల్లా నుంచి ఎండీ జాకీర్‌అహ్మద్, ఎస్.కార్తీక్, ఎం.రేవంత్(అనంతపురం), జి.సందీప్( తూర్పు గోదావరి), కె.అభిలాష్ (పశ్చిమ గోదావరి), బాలికల జట్టుకు కృష్ణా జిల్లా నుంచి వి.కావ్య, ఎండీ రెహ్నుమ, కె.వర్షిణి(పశ్చిమ గోదావరి), ఎన్.కవిత(నెల్లూరు), ఎం.భానుప్రియ (అనంతపురం) ఎంపికై నట్లు పోటీల పరిశీలకులు ఎ.పి.రాజు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment