విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
మంగళవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2024
7
బాధ్యతల స్వీకరణ
గాంధీనగర్: ఎన్టీఆర్ జిల్లా ఖజానా అధికారి (డిస్ట్రిక్ట్ ట్రెజరీ, ఎకౌంట్స్ ఆఫీసర్)గా ఎ.రవి సోమవారం విజయవాడలోని జిల్లా ఖజానా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన కలెక్టర్ లక్ష్మీశను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆకతాయిలకు
దూరంగా ఉండండి
పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు
విజయవాడస్పోర్ట్స్: ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడే ఆకతాయిలను దరిచేరనివ్వద్దని విద్యార్థినులకు పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు సూచించారు. కేవలం చదువుపైనే శ్రద్ధ ఉంచి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని హితవు పలికారు. అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం పురస్కరించుకుని తరుణి తరంగాలు, శ్రీదుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కాలేజీ యాజమాన్యం సంయుక్తంగా సోమవారం కాలేజీలో నిర్వహించిన అవగాహన సదస్సుకు కమిషనర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. మహిళలను ప్రేమ పేరుతో మోసం చేసే వారిని, లైంగిక వేధించే వారిని, సోషల్ మీడియాలో మహిళలను వేధించే వారిని, అఘాయిత్యాలకు పాల్పడే వ్యక్తులకు ప్రత్యేక చట్టాల ద్వారా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో స్కూల్, కాలేజీల వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో డ్రోన్ల ద్వారా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. విద్యార్థినులపై అమానుషంగా ప్రవర్తించే ఆకతాయిలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆకతాయిల ఆగడాలను నియంత్రించడానికి ఈ–పహారా బీట్లను కొనసాగిస్తున్నామని కమిషనర్ వెల్లడించారు. కార్య క్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.కల్పన, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.పద్మజ, డాక్టర్ ఆర్.సుధారాణి, తరుణి తరంగాలు ఉపాధ్యక్షురాలు విద్యాకన్నా, కన్వీనర్ సుధారాణి పాల్గొన్నారు.
వీళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలి
మధుమేహం,రక్తపోటు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు చలికాలంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దగ్గు, జలుబు ఆయాసం వంటివి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వాకింగ్ చేసే వారు ఎండ వచ్చిన తర్వాత చేస్తే మంచిదంటున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే చలికి ఎక్స్‌పోజ్‌కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు అంటున్నారు. శ్వాస ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే చలికాలంలో అప్రమత్తంగా ఉండటంతో పాటు, వేడి ఆహారం తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
న్యూస్‌రీల్
శ్వాసకోశ వ్యాధిగ్రస్తులూ.. మరింత అప్రమత్తత అవసరం చలి ఎక్కువగా ఉంటే బయటకు రాకుండా ఉండటం మంచిది చలితో గుండెపోటుకు గురయ్యే అవకాశం పోస్టు కోవిడ్ రోగులు జాగ్రత్తగా ఉండాలి సూర్యోదయం తర్వాత వాకింగ్ బెటర్
పటమటలో ఉండే వెంకట్ ఉదయం 5 గంటలకే వాకింగ్‌కోసం గ్రౌండ్‌కు వెళ్తాడు. వారం రోజులుగా మధ్యాహ్నం తలనొప్పి రావడంతో వైద్యుడిని సంప్రదించారు. సైనటైటీస్‌గా నిర్ధారించారు. చల్లని వాతావరణంలో వాకింగ్ చేయడంతో సైనస్ వచ్చినట్లు తెలిపారు.
రాణీగారితోటకు చెందిన 60 ఏళ్ల వెంకటేశ్వర రావుకు ఆస్తమా ఉంది. ఇటీవల గ్రౌండ్‌లో వాకింగ్ చేస్తుండగా ఆయాస పడుతున్నాడు. వైద్యుడిని సంప్రదిస్తే చలి పెరగడంతో ఇలా జరిగిందని, సూర్యోదయం తర్వాత వాకింగ్‌కు వెళ్లాలని సూచించారు.
ఇలా నగరంలో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. చలిలో మార్నింగ్‌వాక్‌కు వెళ్తే జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగరంలో వారం రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు ఉదయం చలి కూడా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధులున్న వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కోవిడ్ తర్వాత శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు మరింత పెరిగారు. అలాంటి వారు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఆస్తమా రోగులతో పాటు మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలంటున్నారు. చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్తే గుండెపోటుకు గురయ్యే అవకాశముంది. వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు, వృద్ధుల విషయంలో మరింత అప్రతమత్తంగా ఉండాలంటున్నారు.
పోస్ట్ కోవిడ్ రోగుల్లోనూ..
ఇంకా పోస్టు కోవిడ్ రోగుల్లో వేర్వేరు దుష్ఫలితాలు కనిపిస్తూనే ఉన్నాయి. కొందరిలో షుగర్‌లెవల్స్ పెరుగుతుండగా, మరికొందరిలో గుండె సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్ గురైన వారు ఉంటున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. చలిలతో శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తవచ్చని సూచిస్తున్నారు. జలుబు, దగ్గుతో పాటు, ఆయాసం, నిమోనియా వంటివి సోకే ప్రమాదం లేకపోలేదంటున్నారు. చలిఎక్కువగా ఉన్నప్పుడు బయటకు రాకుండా ఉండటమే మేలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరైతే జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలి.
– లబ్బీపేట(విజయవాడతూర్పు)
Comments
Please login to add a commentAdd a comment