జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తా..
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాను అభి వృద్ధి పథంలో నడిపిస్తానని నూతన కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు. ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్‌లోని చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత కీలకమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. కలెక్టర్‌గా అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ, సంక్షేమ, అభివద్ధి పథకాలు, కార్యక్రమాల అమల్లో జిల్లా ముందు వరుసలో నిలిచేలా కృషి చేస్తానన్నారు. కలెక్టర్ లక్ష్మీశకు జేసీ నిధిమీనా, అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, కలెక్టరేట్ ఏవో ఎస్.శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ ప్రతినిధులు ఆర్‌వీ రోహిణీదేవి, జాహ్నవి, సూర్యారావు, జిల్లా సంఘ ప్రతినిధులు డి.శ్రీనివాస్, రామకృష్ణ, అప్పారావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
దుర్గమ్మ సన్నిధిలో
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయన్ను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
కలెక్టర్ లక్ష్మీశ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అంద జేశారు. ఈఈ కోటేశ్వరరావు, స్థానాచార్య శివప్రసాద్ శర్మలు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను ఆయనకు ఇచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా
డాక్టర్ లక్ష్మీశ బాధ్యతల స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment