కోనేరుసెంటర్: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్త గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన మచిలీపట్నంలో సోమవారం చోటుచేసుకుంది. రైల్వేహెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఉలా ఉన్నాయి.. మచిలీపట్నం నిజాంపేటకు చెందిన పుప్పాల గోపీకృష్ణ, కన్యకపరమేశ్వరీకావ్య (32) భార్యభర్తలు. ఇరువురు జొమాటోలో డెలివరీ వర్కర్‌లుగా పనిచేస్తున్నారు. వీరికి పాప, బాబు ఉన్నారు. కొంతకాలంగా గోపీకృష్ణ వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవటంలేదు. దీంతో ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి ఇరువురు అదే విధంగా గొడవ పడ్డారు. సోమవారం తెల్లవారుజామున పని నిమిత్తం బయలుదేరి వెళ్లారు. అక్కడ మరలా గొడవ మొదలవటంతో వ్యసనాలకు బానిసైన భర్త తాను ఆత్మహత్య చేసుకుని చనిపోతానంటూ భార్యను బెదిరించాడు. అతని చేష్టలకు విసిగిపోయిన కావ్య నీతో పాటు నేనూ చనిపోతాను పదా అంటూ బెదిరించింది. మాటామాటా పెరగటంతో ఇద్దరూ బైక్‌పై బందరు మండలం భైరాగిపాలెం రైల్వే గేటు వద్దకు వెళ్లి వేగంగా వస్తున్న రైలుకు ఎదురు వెళ్లారు. కావ్యను రైలు ఢీకొనటంతో అక్కడికక్కడే చనిపోయింది. భార్యను రైలు ఢీకొనటాన్ని కళ్లారా చూసిన గోపీకృష్ణ పట్టాలపై నుంచి తప్పుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ అతనిని కూడా రైలు ఢీకొనటంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న రైల్వే హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి వివరాలు నమోదు చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. గోపీకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
భార్య మృతి, భర్తకు గాయాలు
Comments
Please login to add a commentAdd a comment