జన గణనతో పాటే కుల గణన చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

జన గణనతో పాటే కుల గణన చేపట్టాలి

Published Tue, Nov 26 2024 1:43 AM | Last Updated on Tue, Nov 26 2024 1:43 AM

జన గణనతో పాటే కుల గణన చేపట్టాలి

జన గణనతో పాటే కుల గణన చేపట్టాలి

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించిన బీసీ సంఘం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో చేపట్టబోయే జనగణనతో పాటే సమగ్ర కుల గణన జరపాలని, ఆ తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ను మహాజన పిటిషన్‌ ద్వారా బీసీ సంక్షేమ సంఘం అభ్యర్థించింది. సోమవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జన గణనతో పాటే కుల గణన చేపట్టాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్‌ వద్ద ప్రదర్శన నిర్వహించారు. అంతకు ముందు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు పూల మాల వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి కలెక్టరేట్‌కు చేరుకుని కలెక్టర్‌ లక్ష్మీశకు వినతిపత్రం సమర్పించారు.

రేపటి నుంచి ఫెన్సింగ్‌ పోటీలు

విజయవాడస్పోర్ట్స్‌: రాష్ట్ర స్థాయి జూనియర్‌(అండర్‌–20) బాల, బాలికల ఫెన్సింగ్‌ పోటీలను విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జి.ఎస్‌.వి.కృష్ణమోహన్‌ సోమవారం తెలిపారు. ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు కార్డు కలిగి, 2011 అక్టోబర్‌ 31వ తేదీ నుంచి 2005 జనవరి ఒకటో తేదీ మధ్యలో జన్మించిన వారు ఈ పోటీలకు అర్హులన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న క్రీడాకారులు https://forms.gle/KM8 VNiEMnfMtvBoC6 వెబ్‌సైట్‌లోని ఫారంలో వివరాలు నమోదు చేసి ఎంట్రీలను పొందాలని సూచించారు. ఆన్‌లైన్‌ ఎంట్రీల హార్డ్‌ కాపీలు, వ్యక్తిగత ఫెన్సింగ్‌ కిట్‌తో 27వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఎంపిక ప్రాంగణానికి చేరుకోవాలన్నారు. ఈ పోటీల్లో విజేతలు డిసెంబర్‌ రెండో తేదీ నుంచి బీహర్‌ రాష్ట్రంలోని పాట్నాలో జరిగే జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement