ఐక్యతతో మహిళలపై దాడులను అరికడదాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మహిళలపై జరుగుతున్న హింసను రూపుమాపాలంటే ఐక్యతతో పాటు విద్యావంతులు కావాలని ట్రైకార్ జీఎం మణికుమార్ అన్నారు. దళిత సీ్త్ర శక్తి ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారోద్యమం చేపట్టారు. సోమవారం లెనిన్ సెంటర్‌లోని అంబేడ్కర్ భవన్‌లో ప్రచారోద్యమాన్ని దళిత సీ్త్ర శక్తి జాతీయ కన్వీనర్ ఝాన్సీ గెడ్డెంతో కలిసి మణికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు సన్మార్గంలో నడవాలన్నా, భవిష్యత్ బాగుపడాలన్నా కుటుంబ వ్యవస్థ ప్రధానపాత్ర పోషించాలన్నారు. అనంతరం దళిత సీ్త్ర శక్తి జాతీయ కన్వీనర్ ఝాన్సీ గెడ్డెం మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి ఏటా మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం వరకు ప్రచారోద్యమం నిర్వహిస్తోందన్నారు. 16 రోజులపాటు సాగే ఈ ప్రచారోద్యమంలో మహిళలను చైతన్యం చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా మండలాల్లో, పట్టణాలు, మురికి వాడలు, పాఠశాలలు, కళాశాలలు , కంపెనీలలో కార్మికులతో కలిసి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. టెలికాం జనరల్ మేనేజర్ తారాచంద్, ఏపీ ట్రాన్స్ కో డెప్యూటీ ఇంజినీర్ శ్రీశైలజ, సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ పద్మజ తదితరులు పాల్గొన్నారు.
ట్రైకార్ జనరల్ మేనేజర్ మణికుమార్
Comments
Please login to add a commentAdd a comment