దేశ్‌ కా ప్రకృతి పరిక్షణ్‌ అభియాన్‌ యాప్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

దేశ్‌ కా ప్రకృతి పరిక్షణ్‌ అభియాన్‌ యాప్‌ ఆవిష్కరణ

Published Wed, Nov 27 2024 7:19 AM | Last Updated on Wed, Nov 27 2024 7:19 AM

దేశ్‌ కా ప్రకృతి పరిక్షణ్‌         అభియాన్‌ యాప్‌ ఆవిష్

దేశ్‌ కా ప్రకృతి పరిక్షణ్‌ అభియాన్‌ యాప్‌ ఆవిష్

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆయుర్వేద వైద్యంపై ప్రజలకు అవగాహన కలిగించే ఉద్దేశంతో దేశ్‌ కా ప్రకృతి పరిక్షణ్‌ అభియాన్‌ – 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సాయి సుధాకర్‌ తెలిపారు. గవర్నర్‌పేటలోని ఆయుర్వేద కళాశాలలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి వివరాలు పొందుపరిచేందుకు ఈ నెల 26 నుంచి డిసెంబరు 25 వరకూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ్‌ కా ప్రకృతి పరీక్షన్‌ అభియాన్‌ పేరుతో ప్రత్యేక యాప్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని తమ వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఆయుర్వేద జీవన విధాన పద్ధతులతో ఆయుష్‌ను పెంచుకుని ఆరోగ్యవంతులుగా జీవించాలనేదే దీని ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ యాప్‌ ద్వారా వ్యాధులను అధిగమించేందుకు ఆచరించాల్సిన పద్ధతులను తెలియజేస్తారని తెలిపారు. వయస్సు 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు యాప్‌ ద్వారా వివరాలు నమోదు చేయాలన్నారు. ‘నా సంకల్పం – నా ఆరోగ్యం దానికి మూలం ఆయు ర్వేదం’ అని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం నోడల్‌ అధికారి డాక్టర్‌ నిర్మల జ్యోతిభాయి, కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.విజయకుమారి, విజయశ్రీ, పలువురు వైద్యులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement