రోడ్డెక్కిన రైతన్నలు.. నిరసన దీక్షలకు దిగిన ఉద్యోగులు..
108 అంబులెన్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 108 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 108లో పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. సూపర్ సిక్స్ పథకాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కేవలం ఐదు నెలల్లోనే ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే అమలు చేయడం ప్రారంభించింది. కానీ కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా ఎన్నికల్లో గట్టెక్కే వరకే మేనిఫెస్టో అన్నట్లు వ్యవహరిస్తోంది. దీంతో రాష్ట్రంలోని రైతులు, ఆటోకార్మికులు, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఇలా ప్రతి ఒక్కరూ రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. నిరాహార దీక్షలు చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. జిల్లాలో కూటమి అధికారం చేపట్టిన ఐదు నెలల కాలంలో జరిగిన ధర్నాలు, దీక్షలు, ఆందోళనలను పరిశీలిస్తే..
మినహాయింపు కోసం ముట్టడి..
రాష్ట్రంలోని గిరిజన కులాల్లో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమను మెగా డీఎస్సీ నుంచి మినహాయించాలని, ఔట్‌సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాలని, 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరుతూ ఆందోళన బాట పట్టారు. గత పదిహేను రోజులుగా దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యాశాఖ మంత్రి ఇంటి వద్దకు వెళ్లి ఆందోళన చేశారు.
యానిమేటర్లపై కక్ష సాధింపులకు నిరసన..
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే వెలుగు యానిమేటర్లను రాజకీయ కక్ష సాధింపులతో తొలగించింది. వారంతా కోర్టును ఆశ్రయించి ఆర్డర్లు పొందినా విధుల్లో చేర్చుకోకుండా నిర్లక్ష్యం చేసింది. దీనిపై ఆగ్రహించిన యానిమేటర్లు ఉద్యమ బాట పట్టారు.
సర్దుబాటు బాదుడుపై..
విద్యుత్ ట్రూ అప్ చార్జీలు రద్దు చేయడంతో పాటు స్మార్ట్ మీటర్లు అమర్చడాన్ని నిలిపివేయాలని, సర్దుబాటు చార్జీల పేరుతో వినియోగదారులపై భారాలు మోపడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అలాగే దొంగ చాటుగా స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని అడ్డుకున్నారు. ప్రీ పెయిడ్ మీటర్లతో ప్రజలను కూటమి ప్రభుత్వం దోచుకోవాలని ప్రయత్నిస్తోందని విమర్శిస్తూ ఆందోళన చేపట్టారు.
వలంటీర్ల భవిష్యత్తు కోసం..
గత ప్రభుత్వం సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేసేందుకు వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది. ఐదేళ్లపాటు విజయవంతంగా పనిచేసింది. కరోనా వంటి విపత్తులోను వెరవక సేవలందించింది. కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ. 10వేలు జీతాలు ఇస్తామని నమ్మించింది. తీరా అధికారంలోకి రాగానే వ్యవస్థే లేదని ప్రకటించింది. దీంతో ఆగ్రహించిన వలంటీర్లు నిరసన గళం వినిపిస్తున్నారు.
పెట్టుబడి సాయం కోసం రైతన్నలు..
రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడి సాయం అందించాలని, బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతు, రైతు కూలీ, వ్యవసాయ కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి.
గత సెప్టెంబర్‌లో బుడమేరు వరదలకు నగరం అతలాకుతలం అయ్యింది. చాలా మంది సర్వం కోల్పోయి రోడ్డునపడ్డారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చిన్నచూపుచూసింది. చేసేది లేక బాధితులంతా రోడ్డెక్కారు. కలెక్టరేట్లను ముట్టడించారు. ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వరదల్లో నష్టపోయిన ఆటో కార్మికులకు ప్రభుత్వం మొండి చూపింది. దీనిపై వామపక్ష పార్టీలు, వైఎస్సార్ సీపీ, కార్మిక సంఘాలు ఆందోళన చేశాయి.
ప్రభుత్వం ఉచిత ఇసుక అందించాలని, నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. పనుల్లేక పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక పేరుతో పక్క రాష్ట్రాలకు తరలిపోతోందని, తమకు ఉపాఽధి దెబ్బతిందని ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
రాష్ట్రంలో రాజ్యమేలుతున్న
రెడ్ బుక్ రాజ్యాంగం
వరద సాయంలో వివక్షపై..
ఐదు నెలల్లోనే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఘోర వైఫల్యం సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కుతున్న కార్మికులు, కర్షకులు
కార్మిక లోకం కన్నెర్ర..
ఆశ, అంగన్‌వాడీల ఆందోళన బాట
అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు తమ్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఆశ వర్కర్లను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, రిటైర్‌మెంట్ వయసు పెంచాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment