మధురానగర్(విజయవాడసెంట్రల్): గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ మంగళవారం డెమొక్రటిక్ అసోసియేషన్ నేతలు సాంఘిక సంక్షేమ సచివాలయాల మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వేయబోయే కమిటీలో ఉద్యోగులకు ప్రాతినిధ్యం కల్పించాలని డెమొక్రటిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి. జోసఫ్ కిషోర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిషోర్ అప్పికట్ల, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు పి. కృష్ణ్ణయ్య కోరారు.
Comments
Please login to add a commentAdd a comment