![గతం ఘనం.. భవిష్యత్ ప్రశ్నార్థకం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/06vic183-310160_mr-1739129179-0.jpg.webp?itok=cD75xZVz)
గతం ఘనం.. భవిష్యత్ ప్రశ్నార్థకం
విజయవాడకల్చరల్: రాష్ట్రంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతలు కలిగిన ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాల నేడు ఉనికిని కోల్పోతోంది. 65 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగి, వందలాది మంది విద్వాంసులను, నృత్య కళాకారులను తయారు చేసిన సంగీత కళాశాల నేడు లయ తప్పుతోంది. బుడి బుడి అడుగులతో నృత్య సవ్వడితో అలరారే మువ్వలు మౌనంగా రోధిస్తున్నాయి. తమకు పూర్వవైభవం తీసుకువచ్చే వారి కోసం మౌనంగా ఎదురుచూస్తున్నాయి.
సంగీత విద్వాంసులే నిర్వాహకులుగా..
గాయక సార్వభౌమ పారుపల్లి రామ కృష్ణయ్య పంతులు ప్రోత్సాహంతో నాటి ప్రభుత్వం నగరంలో 65ఏళ్ల క్రితం ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేసింది. తొలుత అద్దె భవనాలతో సరిపెట్టుకున్న సంగీత కళాశాలకు దుర్గాపురంలో విశాలమైన ప్రాంగణం విశాలమైన గదులతో కనువిందు చేస్తోంది. నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి సంగీత కళాశాలకు ఘంటసాల వెంకటేశ్వరరావు పేరుపెట్టారు. సంగీత కళాశాలకు తొలి ప్రిన్సిపాల్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ఇదంతా గతం.
లయ తప్పుతోంది..
నేడు సంగీత కళాశాల లయ తప్పుతోంది. నిర్వాహకులు కళాశాల మీద శ్రద్ధ చూపించకపోవడం, అధ్యాపకులు, నాన్ టీచింగ్ ఉద్యోగుల మధ్య సమన్వయం లేకపోవడంతో కళాశాలలో చేరే విద్యార్థుల సంఖ్య కన్నా.. మానేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. కొంతమంది అధ్యాపకులు పాఠాలపై శ్రద్ధ చూపకపోవడం, వచ్చామా వెళ్లామా అన్నట్లుగా ఉంటున్నా ఇదే ప్రాంగణంలో ఉన్న భాషా సాంస్కృతిక శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కొంతమంది అధ్యాపకులు ఆన్‌లైన్ ద్వారా పాఠాలు చెప్పడం, కళాశాలలో పాఠాలకు మంగళం పాడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలకు వాచ్‌మెన్ లేకపోవడంతో రాత్రి వేళ కళాశాల అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారింది.
దిగువ స్థాయి సిబ్బందితోనే..
నాటి తెలుగుదేశం ప్రభుత్వం సాంస్కృతిక కార్యక్రమాలకు ఘంటసాల సంగీత కళాశాల నిధులను సాంస్కృతిక శాఖకు మళ్లించడంతో నేడు విద్యుత్ బిల్లు కట్టడానికి కూడా కటకటలాడుతోంది. కళాశాలలో అడ్మిషన్లు, ఇతర అవసరాలకు సహాయ పడాల్సిన సిబ్బంది సరైన సమయానికి రాకపోవడం సమాధానం చెప్పేవారులేక దిగువ స్థాయి సిబ్బందితో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
లయ తప్పుతున్న సంగీత కళాశాల
పాఠాలపై శ్రద్ధపెట్టని అధ్యాపకులు
ఆన్‌లైన్ పాఠాలకు మొగ్గు
చూపుతున్న వైనం
Comments
Please login to add a commentAdd a comment