పరిహారం చెల్లించాలని డిమాండ్
మల్కన్‌గిరి: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఉపాధ్యాయుడు, ఎన్నికల ప్రొసీడింగ్ అధికారి ఇంద్రజిత్ కిర్సనీ కుటుంబానికి పరిహారం చెల్లించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి వద్ద మంగళవారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇంద్రజిత్ కిర్సనీ ప్రాణాలు కోల్పోయారు. ఈయన కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ సచిన్ పవార్‌కు బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు తారక్ మండాల్, సంఘ ప్రతినిధులు రంజిన్ నాయిక్, ప్రదిప్ కుమార్ దోలాయి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment