–8లోu
భువనేశ్వర్: గుణుపురం మాజీ ఎమ్మెల్యే రామ మూర్తి గొమాంగోకు వ్యతిరేకంగా దిగువ న్యాయస్థానం జారీ చేసిన తీర్పుకు రాష్ట్ర హైకోర్టు పట్టం గట్టింది. భార్య హత్య కేసులో దిగువ న్యాయ స్థానం ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పుని సవాల్ చేసిన మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసు విచారణ పురస్కరించుకుని రాష్ట్ర హై కోర్టు పూర్వాపరాలు పరిశీలించిన మేరకు లోగడ దిగువ న్యాయ స్థానం జారీ చేసిన తీర్పుని ఖరారు చేస్తు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
కేసు వివరాలు ఇలా..
1995 సంవత్సరంలో మాజీ ఎమ్మెల్యే భార్య శశి రేఖ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు భర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక దశలో అసహజ మరణంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 1995 ఆగస్టు 29న స్థానిక ఖారవేళ నగర్ ఎమ్మెల్యే కాలనీ క్వార్టరు బాత్రూమ్‌లో శశి రేఖ పాక్షిక దగ్ధ శరీరం గుర్తించారు. అప్పటికి ఆమె గర్భిణిగా ధృవీకరించారు. ఈ ఆధారాలతో లోతుగా చేపట్టిన దర్యాప్తులో ముందస్తు వ్యూహాత్మక హత్యగా పోలీసుల విచారణలో తేలింది. ఈ నివేదిక ఆధారంగా నర బలి, హత్య ఆరోపణతో ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తదుపరి దశలో సాక్ష్యాల గల్లంతు ఆరోపణతో ఐపీసీ 201 సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈ కేసుల విచారణలో న్యాయ స్థానం 11 మంది సాక్షుల్ని ప్రశ్నించి 15 బలమైన పత్రాల్ని పరిశీలించింది. ఈ పరిశీలన ఆధారంగా ఆరోపణలు రుజువు కావడంతో నిందిత మాజీ ఎమ్మెల్యే రామ మూర్తి గొమాంగోకు స్థానిక ఎమ్మెల్యేకి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రామ మూర్తి గొమాంగో జనతా దళ్, బిజూ జనతా దళ్, భారతీయ జనతా పార్టీల తరుఫున ఎమ్మెల్యేగా గెలిపొందారు.
Comments
Please login to add a commentAdd a comment