జగన్నాథ్ సాగర్ పునరుద్ధరించాలి
జయపురం: పట్టణంలోని చరిత్రాత్మక జగన్నాథ్ సాగర్ పునరుద్ధరించాలని జయపురం మో జగన్నాథ్ సాగర్ ట్రస్టు డిమాండ్ చేసింది. ట్రస్టు ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ను ఉద్దేశించిన వినతిపత్రాన్ని జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్య రెడ్డికి మంగళవారం సమర్పించారు. జగన్నాథ్ సాగర్ అభివృద్ధి, పునరుద్ధరణకు చేపడుతున్న పనులు హాస్యాస్పదంగా ఉన్నాయని నిందించారు. జగన్నాథ సగర్ పురుద్ధరణకు వినతిపత్రంలో ట్రస్టు కొన్ని సూచనలు చేసింది. పునరుద్ధరణ పేరుతో చేపట్టిన సుందరీకరణ పనులు ముందుగా నిలుపు చేయాలని విజ్ఞప్తి చేసింది. వివిధ విభాగాల ఆధీనంలో ఉన్న జగన్నాథ్ సాగర్‌ను ఒకే విభాగం పరిధిలోకి తీసుకు రావాలన్నారు. ముందుగా సాగర్ సరిహద్దులను కొలతల ద్వారా గుర్తించి ఎన్ని ఎకరాలు ఉన్నది వెల్లడించాలని కోరారు. జగన్నాఽథ్ సాగర్‌లో కలుస్తున్న అన్ని డ్రైనేజీలు బంద్ చేయాలని డిమాండ్ చేశారు. సాగర్ పరిధిలోని మత్య్స విభాగ కార్యాలయాన్ని మరో ప్రాంతానికి తరలించాలని కోరారు. జగన్నాథ్ సాగర్‌ను కేంద్ర ప్రభుత్వ అమృత సరోవర పథకంలో చేర్చాలని, ఇంతవరకు సాగర్ అభివృద్ధికి చేసిన ఖర్చుపై దర్యాప్తు జరపాలని విన్నవించారు. అనంతరం జయపురం ప్రజానీకాన్ని జగన్నాథ్ సాగర్‌పై అవగాహన కల్పించేందుకు ‘సేవ్ జగన్నాథ్ సాగర్’ రథాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షుడు రజనీ కాంత నాయిక్, కార్యదర్శి నిరంజన్ పాణిగ్రహి, బి.చంద్ర శేఖర్, రంజన్ పాణిగ్రాహి, రఘు త్రిపాఠీ, లలిత అగర్వాల్, లున పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment