No Headline
రాయగడ: మట్టిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ నష్టపోడు అన్న నానుడిని నిజం చేస్తూ ఓ యువ రైతు లాభాల పంట పండిస్తున్నాడు. ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసినా వ్యవసాయంపై ఉన్న మక్కువతో భూమితల్లిని నమ్ముకుని సాగులోకి దిగి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. వ్యవసాయం పూలబాట కాదని కొందరు నిరుత్సాహపరిచినా వెనుకడుగు వేయకుండా సేద్యంలో సిరులు పండిస్తున్నాడు. సెంటు భూమి కూడా లేని నువ్వు ఏం వ్యవసాయం చేస్తావన్న వారి నోళ్లు మూయించి కాసులు సంపాదిస్తూ పది మందికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అతనే యువ రైతు కె.రామ్‌చరణ్.
రాజమండ్రి టు రాయగడ..
రాయగడ పట్టణానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని సాయిప్రియ నగర్ ప్రాంతంలో ఎకరా విస్తీర్ణంలో బంతి సాగు చేస్తున్న యువ రైతు కె.రామ్‌చరణ్. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి ప్రాంతానికి చెందిన రామ్‌చరణ్ రెండేళ్ల క్రితం బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ వ్యవసాయంపై మక్కువ, తండ్రి రైతు కావడంతో ఆ దిశగా అడుగులు వేశాడు. తండ్రి వద్ద మెలకువలు నేర్చుకుని వ్యవసాయంపై పట్టు సాధించాడు. గత ఏడాది 15 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని వంగ, టొమాటొ, క్యాబేజీ వంటి పంటలను సాగు చేశాడు. ఛత్తీస్‌గఢ్ నుంచి తీసుకొచ్చిన హైబ్రిడ్ రకం బంతి నారును ఎకరా విస్తీర్ణంలో నాటాడు. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రాధాన్యం కల్పించడంతో మంచి దిగుబడులు సాధిస్తున్నాడు. ఏడాదిలోమూడు సార్లు పంట చేతికి అందడంతో మంచి లాభాలు వస్తున్నాయని రామ్‌చరణ్ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment