భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభ శీతాకాల సమావేశాలు నవంబర్ 26 నుంచి ఆరంభమై డిసెంబర్ నెల 31వ తేదీ వరకు కొనసాగుతాయి. మోహన్ చరణ్ మాఝి సర్కారు అధికారం చేపట్టిన తరువాత ఇవే తొలి శీతాకాల సమావేశాలు. 30 రోజులు సమావేశాలు నిర్వహించనున్నారు. వీటిలో 25 అధికారిక పని దినాలు, మిగిలిన 5 ప్రైవేట్ సభ్యుల పని దినాలుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ 5 దినాలు బిల్లులు, తీర్మానాల వ్యవహారాలు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో 2024– 25 ఆర్థిక సంవత్సరం తొలి అనబంధ వ్యయ ప్రణాళిక చిట్టా ప్రవేశ పెడతారు. ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఈ ప్రతిపాదనల్ని సభలో ప్రవేశ పెట్టనున్నారు. డిసెంబర్ నెల 5న ఈ ప్రతిపాదనలను ప్రవేశ పెట్టేందుకు కార్యక్రమం ఖరారైంది. నవంబరులో 5 రోజులు, డిసెంబర్‌లో 25 రోజులు సమావేశాలు ఉంటాయి. క్రిస్మస్ పురస్కరించుకుని డిసెంబర్ 25న సమావేశాలకు సెలవు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment