రాజీవ్‌ గాంధీకి ఘనంగా నివాళులు | Sakshi
Sakshi News home page

రాజీవ్‌ గాంధీకి ఘనంగా నివాళులు

Published Wed, May 22 2024 6:50 AM

రాజీవ

జయపురం: దేశ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం స్థానిక కొరాపుట్‌ జిల్లా కాంగ్రెస్‌ భవనంలో నిర్వహించిన రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు రాజీవ్‌ గాంధీ దేశానికి అందించిన సేవలను, పేదరిక నిర్మూలనకు ఆయన చేపట్టిన పథకాలను గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ మీడియా సెల్‌ చీఫ్‌ సుకాంత పట్నాయిక్‌, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి దేవేంద్ర బాహిణీపతి, జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ మాజీ అధ్యక్షుడు రామ నాయిక్‌, బూత్‌ కాంగ్రెస్‌ నేత చిన్న తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన ఆరాధనోత్సవాలు

జయపురం: నవరంగపూర్‌లో విశ్వకర్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన పోతులూరి వీరబ్రహ్మంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో వివిధ దేవతామూర్తులకు భక్తులు పూజలు నిర్వహించారు. మూడు రోజుల పాటు స్వామివారికి అభిషేకం, కుంకుమ పూజ, ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఉత్సవాలను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

నదిలో మునిగి యువకుడు మృతి

పర్లాకిమిడి: గజపతి జిల్లా గుసాని సమితి బాగుసల గ్రామం వద్ద మహేంద్రతనయ నదిలో జారిపడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం కోసమాళ గ్రామానికి చెందిన టి.సాయిరాజు (25) మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కోసమాళ గ్రామానికి చెందిన టి.సాయిరాజు బాగుసళ గ్రామానికి స్నేహితులతో కలిసి సొంత పనిమీద వెళ్లాడు. అనంతరం తిరుగు ప్రయాణంలో కుంభరాణి అమ్మవారి గుడి వద్ద మహేంద్రతనయ ఒడ్డున కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి నదిలో కాలుజారి పడి మునిగిపోయాడు. దీంతో నది వద్ద ఉన్న యువరాజపూర్‌ గ్రామస్తులు వెతికి బయటకు తీసుకొచ్చారు. కాగా అప్పటికే సాయిరాజు మృతి చెందాడు. విషయం తెలియడంతో ఐఐసీ రవీంద్ర పాత్రో సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పర్లాకిమిడి కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

స్కూటీ నుంచి రూ.80 వేలు చోరీ

పర్లాకిమిడి: స్థానిక మొక్కతోటమ్మ గుడి, విశ్వనాఽథ నగర్‌ వద్ద పార్క్‌ చేసి ఉన్న స్కూటీ నుంచి రూ.80వేలు చోరీ చేశారు. విశ్రాంత ఉద్యోగి నర్సింగ మిశ్రా స్థానిక కాలేజ్‌ జంక్షన్‌ మెయిన్‌ బ్యాంచి స్టేట్‌ బ్యాంక్‌ నుంచి మంగళవారం రూ.80 వేలు విత్‌డ్రా చేశారు. తన సోదరుడు నివశిస్తున్న విశ్వనాథనగర్‌లోని ఇంటికి వెళ్తూ బయట స్కూటీ ఉంచారు. తిరిగి బయల్దేరుతుండగా స్కూటీ డిక్కీని విరిగిపోయినట్లు గమనించారు. అందులో ఉన్న రూ.80వేలు మాయమైనట్లు గమనించి లబోదిబోమన్నాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాజీవ్‌ గాంధీకి ఘనంగా నివాళులు
1/3

రాజీవ్‌ గాంధీకి ఘనంగా నివాళులు

రాజీవ్‌ గాంధీకి ఘనంగా నివాళులు
2/3

రాజీవ్‌ గాంధీకి ఘనంగా నివాళులు

రాజీవ్‌ గాంధీకి ఘనంగా నివాళులు
3/3

రాజీవ్‌ గాంధీకి ఘనంగా నివాళులు

Advertisement
 
Advertisement
 
Advertisement