అద్భుత అవకాశం
విద్యార్థుల
ఆలోచనకు
● కేంద్ర సహకారంతో
స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్
● ఆలోచనల సమర్పణకు ఈనెల
30 వరకూ గడవు
పాలకొండ రూర్: కేంద్రప్రభుత్వం చొరవతో 21వ శతాబ్దపు నైపుణ్యాలను విద్యార్థులకు అందించడం ద్వారా వారిని ట్రాన్స్‌ఫర్మేటివ్ నాయకులుగా తీర్చి దిద్దవచ్చని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ క్రమంలో ఉద్దేశించిన కార్యక్రమమే స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. 2023వ సంవత్సరంలో నిర్వహించిన కార్యక్రమంలో19 వేల మందికి పైగా విద్యార్థులు తమ అలోచనలకు పదునుపెట్టి ఇన్నోవేషన్‌లను రూపొందించారు. తాజాగా 2024లో ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రక్రియ ఈ ఏడాది ఆగస్టులో మొదలైంది. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్ధులతో నమోదైన ఐడియాలలో మొదటి 400 స్థానాల్లో నిలిచిన ప్రాజెక్ట్‌స్ ఇంటర్న్‌షిప్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అందులో మొదటి 75 స్థానాలలో నిలిచిన ప్రాజెక్ట్‌స్‌కు మెంటర్‌షిప్‌ను అందిస్తారు. ఇందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అటల్ ఇన్నోవేషన్ మిషన్ అందిస్తుంది. విద్యార్థులకు నగదు బహుమతిని నీతి ఆయోగ్ అందించి ప్రోత్సహిస్తుంది. ఇందుకు సంబంఽధించి 6–10 తరగతుల మధ్య విద్యార్థులు అర్హులుగా విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 180 పాఠశాలు రిజిస్టర్ చేసుకోగా 536 మంది ఉపాధ్యాయుల సహకారంతో 4010 మంది విద్యార్థులు 1429 థీమ్స్‌ను సిద్ధం చేశారు.
విద్యార్థులను సిద్ధం చేయాలి
సైన్స్ ఉపాధ్యాయులు తమ పరిధిలో విద్యార్థులను ఈ అద్భుతమైన కార్యక్రమానికి సిద్ధం చేయాలి. గత అనుభవాలను, విజయాలను స్ఫూర్తిగా పొంది రిజిస్టర్ అయిన విద్యార్థులు తప్పనిసరిగా వారి ఆలోచనలు సబ్‌మిట్ చేసి మరోసారి జిల్లాను ముందువరుసలో ఉంచాలి. మన్యం జిల్లాలో లేదా ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంచుకుని పరిష్కారం చూపేలా విద్యార్థుల నుంచి ఐడియాలను రాబట్టాలి. టీమ్స్ ఐడియా సబ్మిషన్ ప్రతిరోజూ పరిశీలిస్తున్నాం.
– ఎన్.తిరుపతినాయుడు, డీఈఓ,
పార్వతీపురం మన్యం
గడువులోగా సబ్‌మిట్ చేయాలి
ఇప్పటికే జిల్లాలోని అందరు సైన్స్ ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ మోడ్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి ఓరియంటేషన్ పూర్తి చేశాం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. రిజిస్టర్ అయిన విద్యార్థులు తమ ఆలోచనలను సబ్‌మిట్ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఈనెల 30 లోగా పూర్తిచేయాలి. సాంకేతిక సమస్యలు ఏవైనా ఉంటే ఫోన్ 8978077156 నంబర్‌ను సంప్రదించవచ్చు.
– జి.లక్ష్మణరావు, జిల్లా సైన్స్ అధికారి,
పార్వతీపురం మన్యం
థీమ్స్ ఇలా..
1. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్
2. అర్టిఫిషల్ ఇంటలిజెన్స్
3. ఆరోగ్యం/సంరక్షణ
4. ఎకానమిక్ ఎంపవర్‌మెంట్
Comments
Please login to add a commentAdd a comment