సామూహిక సత్యనారాయణ వ్రతాలు రేపు
పూసపాటిరేగ: మండలంలోని కుమిలి గ్రామంలో గల ద్వాదశ దేవాలయంలో మంగళవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నీలాపు రాజారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్రతంలో పాల్గొనే 100 కుటుంబాలకు పూజా సామగ్రి ఉచితంగా ఇస్తామని పేర్కొన్నా రు. ఆసక్తి ఉన్న భక్తులు పాల్గొనాలని కోరారు.
ఘనంగా ఎన్‌సీసీ డే
విజయనగరం అర్బన్: ఎన్‌సీసీ 76వ వార్షికోత్సవాన్ని స్థానిక సీతం ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్‌సీసీ క్యాడెట్లు నిర్వహించిన సాహస విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ గోపేంద్ర మాట్లాడుతూ.. క్రమశిక్షణ, నాయకత్వం వంటి లక్షణాలు పెంపొందించడానికి ఎన్‌సీసీ శిక్షణలు దోహదపడతాయన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు మాట్లాడుతూ.. క్యాడెట్లు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మార్గాలను అన్వషించుకోవాలని సూచించారు. అనంతరం సీతం, సత్య డిగ్రీ కళాశాల, ఎంఆర్ కళాశాల, రఘు ఇంజినీరింగ్ కళాశాల, గవర్నమెంట్ గర్‌ల్స్ హైస్కూల్ క్యాడెట్లు సంయుక్తంగా నిర్వహించిన సాహస విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులు అందజేశారు. రెండవ (ఆంధ్రా) గర్‌ల్స్ బెటాలియన్ ఎన్‌సీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో 230 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు, ఆరుగురు అసోసియేట్ ఎన్‌సీసీ అధికారులు, 33 మంది ఇతర సిబ్బంది హాజరయ్యారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామమూర్తి, వివిధ కళాశాల ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment