ఉద్యోగాల పేరిట యువతులకు ఎర
భువనేశ్వర్: బంగ్లాదేశ్ యువతులతో వేశ్య వ్యాపారం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఉద్యోగం, ఉపాధి హామీ వంటి బూటకపు హామీలు, మాయ మాటలతో అమాయక యువతుల్ని రప్పించుకుని వేశ్య వృత్తిలో వినియోగిస్తున్న వ్యవహారం బట్టబయలైంది. ఈ వ్యవహారంలో సందిగ్ధ సూత్రధారులైన దంపతుల్ని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి 23 మంది యువతుల్ని మోసగించి నగరానికి రప్పించినట్లు ప్రాథమిక సమాచారం. వీరందరికి ఉద్యోగంతో హామీ పూర్వక ఉపాధి కల్పిస్తామని మోసగించి తీసుకుని వచ్చారు. బూటకపు మాటలతో మోసపోయి స్వరాష్ట్రం వీడి ఇక్కడకు చేరిన యువతులకు రోజుకు రూ. 2,000 చొప్పున చెల్లిస్తామని నమ్మించి వేశ్య వృత్తిలోకి దించినట్లు బాధిత వర్గం నుంచి బయటకు పొక్కింది. కటక్ నగరం లింక్ రోడ్ ప్రాంతంలో వీధుల్లో తచ్చాడుతూ తిరుగుతున్న బాలిక కదలిపై పోలీసులకు సందేహం కలిగి అదుపులోకి తీసుకుని బాలల సంక్షేమ కమిటీకి తరలించారు. తదుపరి విచారణలో ఆమె బాలికగా తేలింది. బంగ్లాదేశ్ నుంచి ఇక్కడకు రప్పించిన శైలి పూర్తి క్రమం తెలుసుకుని పోలీసుల సహకారంతో ముఠాపై దృష్టి సారించారు. వాట్సాప్, ఫేస్‌బుక్ ఇతరేతర సోషల్ మీడియా వేదికల్లో పరిచయం చేసుకుని తమకు ఈ వృత్తిలోకి లాగినట్లు వాపోయారు. ఈ అక్రమ వ్యాపారంలో దళారుల గుట్టు రట్టు చేసేందుకు కమిషనరేటు పోలీసులు సన్నాహాలు ఊపందుకున్నట్లు నగర డీసీపీ పినాకి మిశ్రా తెలిపారు. బాధితుల ద్వారా అందిన సమాచారం ఆధారంగా దళారులపై నిఘా పటిష్టపరిచారు. ఈ ప్రయత్నంలో అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాధిత బాలిక వాంగ్మూలం ఆధారంగా శిశు సంక్షేమ కమిటీ పోలీసు వర్గాలకు దాఖలు చేసిన సమాచారం ఆధారంగా ఫిర్యాదు (ఎఫ్‌ఐఆర్) నమోదు చేసినట్లు నగర డీసీపీ వివరించారు. దర్యాప్తుకు బలపరిచే ఆధారాలు, సమాచారం బాలిక అందజేయలేకపోతుంది. అరకొర సమాచారం ఆధారంగా లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు పలు బృందాలుగా పోలీసుల్ని రంగంలోకి దింపారు.
స్వరాష్ట్రంతో సంప్రదింపులు
కటక్ పోలీసుల దృష్టికి వచ్చిన బాలిక స్వదేశం బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లిపోతానని అభ్యర్థిస్తుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ రాయబారి కార్యాలయ వర్గాలతో సంప్రదింపులు జరపనున్నట్లు తెలిపారు.
బంగ్లాదేశ్ నుంచి రప్పించి వేశ్య వృత్తిలోకి దింపుతున్న వైనం
Comments
Please login to add a commentAdd a comment