రోగులకు మెరుగైన సేవలందించాలి
రాయగడ: చికిత్స కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని బిసంకటక్ ఎంఎల్ఏ నీలమాధవ హికక అన్నారు. జిల్లాలోని కళ్యాణ సింగుపూర్లో ఉన్న పీహెచ్సీలో శనివారం సాయంత్రం జరిగిన రోగి కళ్యాణ సమితి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యధిక శాతం మంది ఆదివాసీలు నివసిస్తున్న ఈ ప్రాంతంలోని వారంతా పీహెచ్సీ, సీహెచ్సీలపై ఆధార పడుతుంటారన్నారు. అటువంటి వారికి సరైన చికిత్స అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఇదిలాఉండగా గత ఏడాది రోగి కళ్యాణ సమితికి ప్రభుత్వం మంజూరు చేసే నిధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా నిధులతో జరిగే అభివృద్ధి పనులపై చర్చించారు. పీహెచ్సీ అభివృద్ధిపై సమీక్షించారు. సమావేశంవో సీడీపీవో మమత రాణి దాస్, డాక్టర్ అన్నపూర్ణ తండి, రోగి కళ్యాణ సమితి సభ్యులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నీలమాధవ హికక
Comments
Please login to add a commentAdd a comment