వృద్ధురాలి ఇంటికి వెళ్లి పింఛన్ అందజేత
రాయగడ: పింఛన్ కోసం మూడు కిలోమీటర్ల దూరం నడిచి వెళుతున్న వృద్ధురాలి అవస్థలపై ‘సాక్షి’లో ఈ నెల 23వ తేదీన ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. జిల్లాలోని మునిగుడ సమితి ఘుముటాగడు పంచాయతీలొని జబగుడ గ్రామానికి చెందిన 80 ఏళ్ల గొతే పున్నాలు పింఛన డబ్బుల కోసం ప్రతి నెల మూడు కిలో మీటర్ల దూరంలోని పంచాయతీ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. దీంతో ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనవారు. ఈ విషయాన్ని సాక్షిలో ప్రచురించడంతో అధికారులు స్పందించారు. శనివారం ఆ సమితి బీడీవో దళపతి ఆదేశానుసారం పంచాయితీ పీఈవో గోవింద సునీల్ వృద్ధురాలి ఇంటికి వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందించారు. దీంతో పున్నాలు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment