నేడు యజ్ఞోపవీత సేవ
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని యజ్ఞోపవీత సేవ సోమవారం నిర్వహిస్తున్నారు. మార్గశిర కృష్ణ పక్షం ద్వాదశి తిథి పురస్కరించుకుని ఈ సేవ నిర్వహిస్తున్నట్లు శ్రీ మందిరం అధికార వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా సాధారణ భక్తులకు దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తారు. సోమవారం ద్వితీయ భోగ మండప సేవ తర్వాత యజ్ఞోపవీతం సేవ ఆరంభిస్తారు. సుమారు సాయంత్రం 5 గంటలకు ఈ సేవ ప్రారంభం అవుతుంది. నిరవధికంగా 4 గంటల వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో యజ్ఞోపవీతం సేవ ఆరంభం సాయంత్రం 5 గంటల నుంచి ముగింపు వరకు సుమారు రాత్రి 9 గంటల వరకు దర్శనం తాత్కాలికంగా నిలిపి వేయనున్నట్లు శ్రీ మందిరం అధికార వర్గాలు ప్రకటించాయి.
ుప్త సేవ
శ్రీ జగన్నాథుని శ్రీ అంగ సంరక్షణలో భాగంగా ఏడాది పొడవునా క్రమ పద్ధతిలో పలు రకాల గుప్త సేవలు చేపడతారు. శ్రీ ముఖ అలంకరణ (బొనొకొ లగ్గి) తరచు జరిగే గుప్త సేవ కాగా యజ్ఞోపవీతం, రాహు రేఖ, చిత్తా లగ్గి వంటి అరుదైన సేవలు నిర్వహిస్తుంటారు. దైతపతి సేవకులు ఈ సేవల్ని నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment