కలెక్టర్ కార్యాలయం ముట్టడి రేపు
జయపురం: ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినం సందర్భంగా కొరాపుట్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన జరిపేందుకు ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) నిర్ణయించింది. ఆదివారం స్థానిక కార్మిక భవనంలో జరిగిన కార్మిక సంఘాల సమావేశంలో ఏఐటీయూసీ నాయకుడు ప్రమోద్‌కుమార్ మహంతి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తం ఆందోళనలో భాగంగా ఇక్కడ కూడా ముట్టడి కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కార్మిక, రైతు సమస్యలపై గవర్నర్లకు వినతి పత్రాలను సంఘ నాయకులు అందజేస్తారన్నారు. ఇందులో భాగంగా ఒడిశా రాష్ట్ర గవర్నర్‌ను ఉద్దేశించి కొరాపుట్ జిల్లా కలెక్టర్‌కు జిల్లా కార్మిక సంఘాల తరఫున మెమోరాండం సమర్పిస్తామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్మిక నేతలు సుదర్శణ బిశాయి, సుభాష్ బెహర, అలోక్ పాత్రో, ఉమా శతపతి, ప్రహ్లాదమల్లిక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment