ఈ యుద్ధంలో పేద వర్గాలు గెలవాలి | Sakshi
Sakshi News home page

ఈ యుద్ధంలో పేద వర్గాలు గెలవాలి

Published Thu, May 9 2024 8:40 AM

ఈ యుద్ధంలో పేద వర్గాలు గెలవాలి

నరసరావుపేట: రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలు పేదలకు, సంపన్న వర్గానికి మధ్య జరిగే యుద్ధమని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంతా వైఎస్సార్‌సీపీవైపు ఉండాల్సిన అవసరం ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. బుధవారం ప్రకాష్‌నగర్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ఈ యుద్దంలో పేదవర్గాలు గెలవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయా వర్గాలకు సంక్షేమంతో పాటు అభివృద్ది ఫలాలను అందించారన్నారు. పేదవర్గాలకు అధికారం, సంపద, బడ్జెట్‌లో జనాభాకు మించి కేటాయించారన్నారు. బీసీలకు ప్రత్యేకంగా రాజ్యాంగబద్దమైన హక్కులు లేకున్నా జనాభాకు మించి ప్రాతినిధ్యం కల్పించారన్నారు. చంద్రబాబు తన ఐదేళ్లకాలంలో ఒక్క రాజ్యసభ పదవి ఇవ్వలేదన్నారు. సంపన్న వర్గాలు, మల్టీనేషనల్‌ కంపెనీల ప్రతినిధుల వద్ద డబ్బులు తీసుకుని ఇచ్చారన్నారు. సీఎం జగన్‌ తొమ్మిదింటిలో నాలుగు బీసీలు, ఒక ఎస్సీకి ఇచ్చి దేశానికి సవాల్‌ విసిరారన్నారు. బడ్జెట్‌లో ఏ రాష్ట్రం కూడా బీసీలకు ఐదారువేలకోట్లు ఇవ్వలేదన్నారు. అదే ఆంధ్రప్రదేశ్‌లో రూ.38వేలకోట్లు బీసీలకు కేటాయించి రికార్డు సృష్టించాడన్నారు. ఒకప్పుడు సంపన్నవర్గాలు చదివే ఆంగ్ల మీడియాని ప్రభుత్వ బడుల్లో ఏర్పాటుచేసి పేదవర్గాల పిల్లలు చదువుకునే వెసులుబాటు కల్పించారన్నారు. బీసీల ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పధకాలు అమలుచేయలేదన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీచేస్తున్న డాక్టర్‌ గోపిరెడ్డి చిత్తశుద్దిగల నాయకుడని, పేదవర్గాల అభివృద్దికోసం పనిచేస్తున్నాడన్నారు. మరోసారి ఆయనను గెలిపించి హ్యాట్రిక్‌ సాధించేందుకు బీసీ వర్గాలు తప్పకుండా సహకరించాలని ఆయన కోరారు. ఇది బీసీల ప్రభుత్వమని, మరింతగా అభివృద్ది చేసుకొని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం జగన్‌ చెప్పిందల్లా చేస్తాడని, చంద్రబాబు చెప్పిందేమీ చేయడని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్‌ బీసీలకు పెద్దపీట వేశారన్నారు. 27మంది మంత్రుల్లో 17మంది ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీలు అన్నారు. 17 ఎమ్మెల్సీల్లో 11మంది బీసీలన్నారు. 57కార్పొరేషన్లు ఏర్పాటుచేసి చైర్మన్లు, డైరక్టర్లు చేశారన్నారు. సమావేశంలో ముదిరాజు కార్పోరేషన్‌ డైరక్టర్‌ ఇయం.స్వామి, బీసీ నాయకులు బోయిన సుబ్బారావు పాల్గొన్నారు.

రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య

Advertisement

తప్పక చదవండి

Advertisement