గురజాల ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

గురజాల ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్‌రెడ్డి

Published Fri, May 10 2024 10:50 PM

గురజాల ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్‌రెడ్డి

చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దు

గురజాల: చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని గురజాల ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చర్లగుడిపాడు గ్రామంలో బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాసు మాట్లాడుతూ గతంలో నిరుద్యోగభృతి ఇస్తామని, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి చంద్రబాబు మాటతప్పారన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా కాలంలో కూడా సంక్షేమ పథకాలు మన ఇంటికి వచ్చేలా చూసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రెండు నాల్కల ధోరణితో మాట్లాడే వ్యక్తి చంద్రబాబు అని, ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి జగన్‌ అని అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కేవలం వైఎస్సార్‌సీపీతోనే సాథ్యమన్నారు. ముందుగా గంగమ్మ గుడి, ఆంజనేయ స్వామి, భవనారుషీ, వేణుగోపాల స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎస్సీ కాలనీలో తిరిగి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యెనుముల మురళీధర్‌రెడ్డి, సీనియర్‌ నాయకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు, కొమ్మినేని బుజ్జి, మండల కన్వీనర్‌ సిద్దాడపు గాంధీ, వైస్‌ ఎంపీపీ వేముల శేషమ్మ, సీనియర్‌ నాయకులు వేముల చలమయ్య, కావూరి అంజిబాబు, సర్పంచ్‌ బత్తుల ప్రసాద్‌, పి ముక్కంటి, పి సాంబయ్య, జి అలేఖ, పోట్ల సత్యనారాయణ, బత్తుల తిమ్మరాజు, జమ్మిగుంపుల నాగేశ్వరరావు, సాంబశివరావు, పి మరియదాసు, సాగర్‌ బాబు, వై వెంకటేశ్వర్లు, ఎ నారాయణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement