విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

Published Thu, Nov 7 2024 1:51 AM | Last Updated on Thu, Nov 7 2024 1:51 AM

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

నరసరావుపేట: పెండింగ్‌లో ఉన్న విద్యా, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని, జీవో నెం.77 రద్దు చేయాలని, విద్యా రంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ కోట సాయికుమార్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించా రు. సాయికుమార్‌ మాట్లాడుతూ కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో ఉన్న సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా పెండింగ్‌లో ఉన్న రూ.3,480 కోట్లు విడుదల చేయలేదన్నారు. ఇన్‌చార్జి డీఆర్వో నారదమునిని కలిసి వినతిపత్రం అందజేశారు. నాయకులు అమూల్య, యాసిన్‌, ఫణీంద్ర, సిద్ధు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement