ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసుల కత్తి
సాక్షి, నరసరావుపేట: కూటమి ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తున్న గొంతులపై అక్రమ కేసుల కత్తి పెట్టి నొక్కేయాలని చూడటం దుర్మార్గమని మాజీ మంత్రి విడదల రజిని ధ్వజమెత్తారు. అక్రమ కేసులతో అరైస్టె నరసరావుపేట సబ్ జైలులో ఉన్న చిలకలూరిపేట నియోజకవర్గ సీనియర్ నాయకుడు సింగారెడ్డి కోటిరెడ్డిని ఆమె మంగళవారం పరామర్శించారు. అనంతరం జైలు ముందు మీడియాతో మాట్లాడుతూ 75 ఏళ్ల వ్యక్తిని ఏ తప్పు లేకపోయినా అక్రమ కేసులతో అరెస్ట్‌చేశారని, గ్రామ సచివాలయానికి ఎంపీడీఓ వస్తే సమస్యలను విన్నవించడానికి వెళ్లిన కోటిరెడ్డిని రకరకాల సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులూ పెట్టి అరెస్టు చేయడం దారుణమన్నారు. ఓ రాజకీయ నాయకుడి ఒత్తిడి మేరకే పోలీసులు ఇలా చేశారన్నారు. నరసరావుపేట జైలులోనే ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాజశేఖర్‌రెడ్డి, వెంకటరెడ్డిలనూ విడదల రజిని పరామర్శించారు. వారిపై ఎక్కడ కేసులు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారో కూడా ఆర్థం కావడం లేదన్నారు. అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దని, జగనన్న అండగా ఉన్నా రని భరోసానిచ్చారు. రజిని వెంట సింగారెడ్డి కోటిరెడ్డి కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నేత చిట్టా విజయభాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడదల రజిని ధ్వజం నరసరావుపేట సబ్ జైల్లో వైఎస్సార్‌సీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డి, సోషల్‌మీడియా యాక్టివిస్టులు రాజశేఖర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డిలకు పరామర్శ
Comments
Please login to add a commentAdd a comment