నరసరావుపేట ఈస్ట్/నరసరావుపేట రూరల్: శ్రీశృంగేరీ పీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీ సన్నిధానం తన విజయ యాత్రలో భాగంగా బుధవారం నరసరావుపేటకు రానున్నారు. విజయవాడ నుంచి బుధవారం సాయంత్రం పట్టణంలోని శృంగేరీ శంకరమఠంకు చేరుకుంటారు. శంకరమఠంలోని శంకర చంద్రమౌళీశ్వరస్వామి, శ్రీశారదాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనుగ్రహ భాషణం చేయనున్నారు. అనంతరం రామిరెడ్డిపేటలో నిర్మించిన వేద విద్యార్థుల వసతి గృహం వేదభారతీ గృహాన్ని ప్రారంభించి విశ్రాంతి తీసుకుంటారు. 21న గురువారం ఉదయం 8.30గంటల నుంచి శ్రీమఠ అర్చకులచే చంద్రమౌళీశ్వర పూజలో పాల్గొంటారు. ఉదయం 11.30గంటల నుంచి జగద్గురువుల దర్శనం, పాదుకా పూజలు, భిక్షా వందనం నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తులు స్వామివారికి కానుకలు సమర్పించవచ్చు. సాయంత్రం 4 గంటల నుంచి స్వామికి వీడ్కోలు, శ్రీశృంగేరీ శంకరమఠం నుంచి తన విజయ యాత్రను కొనసాగిస్తారు.
21న కోటప్పకొండకు..
విధుశేఖరభారతీ ఈనెల 21న కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం 9 గంటలకు ఆలయంలో జరిగే స్వామి మూలవిరాట్ అభిషేకాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా భక్తులకు నిర్వహించే మూలవిరాట్ అభిషేకాలను నిలిపివేస్తున్నట్టు ఆలయ ఈఓ డి.చంద్రశేఖరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment